కొంత కాలం గ్యాప్ తర్వాత ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమాల్లో బాగా స్పీడ్ పెంచారు. వైవిధ్య భరిత కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు డబుల్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అయిపోయారు పవన్. రీ ఎంట్రీ తర్వాత పవన్ నటించిన మొదటి చిత్రం.. వకీల్ సాబ్ మూవీ షూటింగ్ ఇటీవలే పూర్తి కాగా, ప్రస్తుతం ఈ పవర్ ఫుల్ హీరో దర్శకుడు క్రిష్ తో పీరియాడికల్ బ్యాక్డ్రాప్లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.