సోహెల్ గతంలో పలు సినిమాలు మరియు సీరియల్స్ లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేక పోయాడు. పదేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ... తనకి సరైన బ్రేక్ లభించలేదు. ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టాడో ఇక అప్పటి నుండి తన దైన శైలిలో హౌస్ లో నడుచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు సోహెల్. ఆఫ్టర్ బిగ్ బాస్ సీజన్ ఫోర్ తో తన క్రేజ్ అలాగే ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది.