చిన్న సినిమాగా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన కలర్ ఫోటో చిత్రం... అంచనాలకు మించిన ఆదరణ పొందింది. కమెడియన్ సుహాస్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. తెలుగు అమ్మాయి చాందినీ చౌదరి హీరోయిన్ గా చేసింది. కమెడియన్ కం హీరో సునీల్ ఈ చిత్రంలో విలన్ గా దర్శనమిచ్చాడు. సందీప్ రాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. కరోనా నేపథ్యంలో ఆహా ఓటీటీ వేదికపై ఈ చిత్రం రిలీజ్ అయింది.