బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య దేశ వ్యాప్తంగా కల కలం రేపింది. ఈ ఉదంతం తర్వాత బాలీవుడ్లో నెపోటిజం, డ్రగ్స్ వినియోగం గురించి భారీ ఎత్తున చర్చలు మొదలయ్యాయి. ఇక డ్రగ్స్ విషయం అయితే వైరల్ గా మారింది. దీంతో ఈ విషయ నిమిత్తం రంగంలోకి దిగింది మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం (ఎన్సీబీ). ఈ డ్రగ్స్ కేసులో మొదట ఏ1 గా నటి రియా చక్రవర్తి పేరు నమోదయింది.