ఓకే బంగారం, కనులు కనులను దోచాయంటే .. ఇలా పలు సినిమాల్లో నటించిన దుల్కర్ సల్మాన్... మహానటి సినిమా తో తెలుగు ప్రేక్షకుల మదిలో గొప్ప స్థానం దక్కించుకున్నాడు. ప్రముఖ నటి సావిత్రి బయోపిక్ తో తెరకెక్కిన మహానటి చిత్రంలో జెమినీ గణేషన్ పాత్రలో ఒదిగి పోయాడు దుల్కర్. రూపం మాత్రమే కాకుండా నటనకు కూడా జెమినీ గణేషన్ లాగా అద్భుతంగా పండించి విశిష్ట గుర్తింపు తెచ్చుకున్నాడు.