పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరే ఒక ప్రభంజనం. యువతకు వంద రెట్లు ఉత్సాహాన్నిచ్చే పలుకు పవర్ స్టార్. మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన ఈ హీరో అన్నకు తగ్గ తమ్ముడుగా ఇండస్ట్రీలో అంచెలంచెలుగా ఎదిగారు. తన నటనతో అభిమానుల సైన్యాన్ని పెంచుకున్నారు. అయితే ఉన్నట్టుండి ఈ అగ్రహీరో సినిమాలు చేయడం ఆపేసి... రాజకీయ రంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే.