ఇమేజ్ విషయాన్ని పక్కన పెట్టి భారీ చిత్రాలకు మాత్రమే ఒప్పుకోకుండా.... కథ నచ్చితే చాలు.. సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే హీరో నందమూరి వారసుడు కల్యాణ్ రామ్. నందమూరి నట వారసత్వంతో వెలిగిపోయే రామ్ 1989లో "బాల గోపాలుడు" చిత్రంతో బాల నటుడిగా మొట్టమొదటి సారిగా వెండి తెరపై కనిపించారు. ఆ తర్వాత "తొలి చూపులోనే" సినిమాతో హీరోగా బరిలోకి దిగారు.