ఇటు రాజకీయ అంశాలకు సంబంధించిన ఒత్తిడి.. మరో వైపు అనారోగ్య సమస్యతో గత కొద్ది రోజులుగా షూటింగ్ కి దూరంగా ఉండి పోయారు సూపర్ స్టార్ రజనీకాంత్. అయితే ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నట్లు ఇప్పటికే క్లారిటీ చేశారు తలైవా. కాగా దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న 'అన్నాత్తే' సినిమా షూటింగ్ సమయంలో తన అనారోగ్య సమస్య వలన... షూటింగ్ కి గ్యాప్ ఇచ్చిన రజనీకాంత్ ఇప్పుడు తన ఆరోగ్యం కుదుట పడడంతో... తిరిగి మళ్లీ కెమెరా ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు.