రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ హీరోలు అనిపించుకుంటున్నారు కొంత మంది హీరోలు. అలాంటి వారిలో మహేష్ బాబు పేరు ముందు ఉంటుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు సమాజసేవ చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. కాకపోతే ఈయన అందించే సహాయాలను గుట్టు చప్పుడు కాకుండా చేస్తుంటాడు ఈ రియల్ హీరో. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే చిన్నారులు ప్రాణాలు నిలబడడానికి దేవుడిగా మారారు మహేష్.