తనదైన శైలిలో.. డిఫరెంట్ యాంగిల్స్ లో చిత్రాలను తెరకెక్కిస్తూ గొప్ప దర్శకుడిగా ప్రేక్షకుల మెప్పును పొందారు యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఉన్న టాప్ దర్శకులలో అనిల్ రావిపూడి కూడా చేరారు. రాజమౌళి, కొరటాల, శంకర్ వంటి ప్రముఖ దర్శకులు తర్వాత ఆ స్థాయిలో సక్సెస్ ఔట్ పుట్ అందుకుంటూ.. విజయ కెరటంతో దూసుకుపోతున్నాడు ఈ కుర్ర డైరెక్టర్.