ఈ సారి బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్న హీరో, హీరోయిన్లు, దర్శక నిర్మాతలు వీరే. ఒక భాషలో క్లిక్ అయిన సూపర్ హిట్ సినిమా కథలను ఇతర భాషలలోకి రీమేక్ చేయడం సహజమే. అయితే ఇతర భాషలలోకి మన నటీనటులు నేరుగా రంగంలోకి దిగి అక్కడి స్టార్స్ తో పోటీ పడడం అంటే అంత చిన్న విషయం కాదు.