అక్రమాలకు అలవాటు పడ్డారని, అధిక లాభాలు పొందడానికి చట్టవిరుద్ధమైన పనులు చేస్తున్నారని సోనూసూద్ పై ఆరోపణలు చేసింది బి ఎం సి. అయితే ఈ ఆరోపణలలో ఏ మాత్రం నిజం లేదని తనపై చర్యలు తీసుకోకుండా, భవనాన్ని కూల్చకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని హైకోర్టులో పిటిషన్ వేసినా, ఇక్కడ చుక్కెదురు కావడంతో.... ఇప్పుడు సుప్రీం కోర్టును ఆశ్రయించారు నటుడు సోనుసూద్.