ఎదుటివారు ఎంత శక్తివంతులైనా, ఎంత మేధావులైనా, వారు చేసిన పని సరికాదని అనిపిస్తే...ఏ మాత్రం ఆలోచించకుండా కుండ బద్దలు కొట్టినట్టు వారి ముఖంపైనే అసలు విషయం అడిగి కడిగిపారేసే స్వభావం గల మనుషులు చాలా తక్కువమంది ఉంటారు. అలాంటి వారిలో ఒకరు ప్రముఖ నటుడు మోహన్ బాబు. రూట్ కరెక్ట్ అయితే రైట్... లేదంటే రాంగ్ అని టక్కున చెప్పే ఈ లెజెండ్ హీరో కొడుకు విష్ణు సైతం ఇప్పుడు ఇదే తరహాలో మాట్లాడి వార్తల్లో నిలిచారు.