ప్రస్తుతం హీరో గోపీచంద్, సంపత్ నంది కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం సిటీమార్. ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు గోపీచంద్. గత కొంత కాలంగా సరైన హిట్ లేక నిరాశ చెందిన ఈ హీరో ఈ చిత్రంతో ఎలాగైనా హిట్ ట్రాక్ ఎక్కాలని ట్రై చేస్తున్నారు. అటు గోపీచంద్ అభిమానులు సైతం ఈ సినిమా తో తిరిగి జిల్ చేస్తాడని నమ్ముతున్నారు. స్పోర్ట్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో తమన్నా భాటియా హీరోయిన్ గా చేస్తోంది.