సినీ ఇండస్ట్రీలో ఎటువంటి సినీ నేపధ్యం లేకుండా నెట్టుకు రావడమంటే కత్తి మీద సాము చేసినట్లే. కానీ తమ టాలెంటునే నమ్ముకుని సినీ పరిశ్రమకు వచ్చిన ఎందరో నటీనటులు ఇది తప్పని నిరూపించారు. అలాంటి వారిలో మన తమిళ హీరో విజయ్ సేతుపతి ముందు వరసలో ఉంటాడు. తన విలక్షణ నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించగల సామర్ధ్యం అతని సొంతం.