టాలీవుడ్ సినిమా పరిశ్రమలో అపజయమెరుగని దర్శకులలో కొరటాల శివ ఒకరు. ఈయన సినిమాలు సమాజానికి ఉపయోగపడేలా సామజిక విలువలను స్పృశించేలా ఉంటాయి. కొరటాల శివ సినిమాను చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఏదో ఒకటి నేర్చుకుంటారు, అదే విషయాన్ని వారి నిత్య జీవితంలో పాటిస్తారు కూడా. కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో సినిమాను ప్రకటించిన నాటి నుండి ఈ క్షణం వరకు మెగా అభిమానులకు పండుగ అని చెప్పాలి.