న్యాచురల్ స్టార్ నాని గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. తెలుగు సినీ పరిశ్రమలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ డం తెచ్చుకున్న అతి కొద్ది మంది నటులలో నాని ఒకరు. తనకు ఏ కథలు సూట్ అవుతాయో వాటినే ఎంచుకుంటూ ఒక ప్రణాళిక ప్రకారం తన సినీ కెరీర్ ను ముందుకు తీసుకెళ్తున్నాడు. ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ ప్రధాన ఇతి వృత్తంగా సినిమాలను ఎంపిక చేసుకుంటాడు.