ఇటీవలే తమిళ సినీ పరిశ్రమకు చెందిన దర్శకుడు ఎస్.పి.జననాథన్ మరణించిన విషయం అందరికీ తెలిసిందే. వారి కుటుంబం ఆ బాధలో ఉండగానే ఆ ఇంట్లో మరో విషాదం చోటు చేసుకోవడం అందరి మనసులను కలచి వేస్తోంది. బ్రెయిన్ స్ట్రోక్ వలన ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఈ నెల 14వ తేదీన కన్ను మూశారు. కాగా ఆయన కుటుంబ సభ్యులు ఆ బాధ నుండి కోలుకోక ముందే మరో విషాదకరమైన విషయాన్ని వినాల్సి వచ్చింది.