కరోనా కారణంగా చిత్ర పరిశ్రమలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలించడంతో మళ్ళీ సినిమాల సందడితో కళకళలాడుతోంది పరిశ్రమ. అన్ని చిత్ర పరిశ్రమలలో కన్నా తెలుగు సినీ పరిశ్రమ పెద్ద పెద్ద చిత్రాలను తెరకెక్కించే పనిలో ఉంది. కొన్ని తెలుగులోనే డైరెక్ట్ చిత్రాలు కాగా, కొన్ని సినిమాలు రీమేక్ లుగా తెరకెక్కుతున్నాయి. అయితే ప్రస్తుతం మన తెలుగు హీరోల మనసు కేరళ ఇండస్ట్రీ మాలీవుడ్ పై పడిందని చెప్పాలి.