కమల హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతిహాసన్ కి... మొదట్లో లక్ కాస్త కలిసి రాలేదనే చెప్పాలి. అప్పట్లో ఈమె సినిమాల సంఖ్య పెరిగి... ప్రత్యేకమైన నటనతో గుర్తింపు తెచ్చుకొంది. కానీ మంచి హిట్ మాత్రం ఖాతాలో పడక పోవడంతో కాస్త డీలా పడింది. కానీ పవర్ స్టార్ సరసన చేసిన గబ్బర్ సింగ్ సినిమా తర్వాత ఈమె దశ తిరిగిందనే చెప్పాలి.