2020 సంవత్సరం అంతా మనము కరోనా కారణంగా అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ కి దూరం అయ్యాము. ముఖ్యంగా థియేటర్లో చూసే సినిమాలకు బాగా అలవాటు పడిన మన తెలుగు ప్రేక్షకులు, థియేటర్లు మూతబడడంతో ఢీలా పడిపోయారు. దాని తరువాత కేంద్ర ప్రభుత్వం థియేటర్ యాజమాన్యాలకు షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో కొంతమేర ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేశారు. ఆ తరువాత 100 శాతం సీటింగ్ కు అనుమతి ఇవ్వడంతో అప్పటి నుండి మళ్లీ సినిమాల జోరు కొనసాగుతోంది. మీకు తెలిసిందే మనకున్న అన్ని సినీ పరిశ్రమల్లో తెలుగు సినీ పరిశ్రమ లో ఎక్కువగా హడావిడి ఉంటుంది.