గతంలో విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం హిట్ ఎంతగా హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించగా నాని నిర్మాణ బాధ్యతలను చూసుకున్నాడు. ఈ సినిమా అటు థియేటర్లలో ఇటు ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు కొనసాగింపుగా హిట్ 2 సీక్వెల్ ను మొదలెట్టేశారు.