పేద వారి జీవితం, సాధారణ ప్రజల కష్టాలు వాటి వెనుకనున్న కన్నీళ్లు... ఆవేదనలే ఆయన కథాంశాలు. పీడిత వర్గాల ప్రజలే ఆయన పాత్రలు. సామాన్య ప్రజలకు జరిగే అన్యాయాలను తెరమీద ధైర్యంగా చూపిన రియల్ స్టార్. సినిమా అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ కాదు. నిజ జీవితంలో మెలుకువలు తెలుసుకొని.. ప్రజలను చైతన్య పరచడమే అంటూ తెరపై మెరిసిన ధ్రువ తార, ఆధ్యాత్మిక వ్యక్తి ఆర్. నారాయణమూర్తి.