సినిమా పరిశ్రమలో రాణించాలంటే కేవలం కష్టపడితే సరిపోదు. కొంచెం అదృష్టం కూడా తోడవ్వాలి. ఇది నటీనటులందరికీ వర్తిస్తుంది. అయితే హీరోయిన్స్ విషయంలో చెప్పాలంటే , ఎంత అందాలు ఒలకబోసినా అదృష్టం ఇసుమంతైనా ఉంటేనే ఇండస్ట్రీ లో నిలదొక్కుకోగలరు. అవును ఇది అక్షర సత్యం. ప్రస్తుతం ఈ సమస్య మన తమిళ సుందరి ప్రియాంక అరుళ్ మోహన్ విషయంలో పక్కాగా సూట్ అవుతుందంటున్నారు సినీ జనం.