దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఎన్ని సినిమాలు చేస్తున్నా... చాలా కాలం బ్రేక్ తర్వాత వెండితెరపై కనిపించనున్న పవన్ మొదటి చిత్రంగా వకీల్ సాబ్ సినిమాపై ప్రేక్షకులు ఎన్నో ఆశలు పెట్టుకొని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.