ఆర్ఎక్స్ 100 సినిమా తో తెలుగు ప్రేక్షకుల మనసులో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ తాజా చిత్రం చావు కబురు చల్లగా. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత... రివ్యూ చూస్తే మిక్సెడ్ టాక్ ను అందుకుంటోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ చిత్ర దర్శకుడు కౌశిక్ ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.