నితిన్ పెళ్లయిన తరువాత కొంచెం సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడని చెప్పాలి. అందుకే మొన్ననే భీష్మ సినిమాతో బంపర్ హిట్ కొట్టాడు. తరువాత చెక్ సినిమా కథ కూడా మంచి కథే అయినప్పటికీ ప్రేక్షకులకు ఎందుకో నప్పలేదు. కానీ ఇది విమర్శకుల ప్రశంసలనందుకుంది. అయితే ప్రస్తుతం మరో అందమైన ప్రేమకథా చిత్రం రంగ్ దే తో మన ముందుకు వచ్చేస్తున్నాడు.