యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పెద్ద పెద్ద నిర్మాతలకు ఒక వరంలా దొరికాడు. ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్ట్ చెయ్యాలని ఆలోచన వస్తే అది ప్రభాస్ తోనే చెయ్యాలి అనే రేంజులో ఉన్నాడు మన ప్రభాస్. ఇది బాహుబలి లాంటి ప్రపంచం గర్వించదగ్గ సినిమా తర్వాతే సాధ్యమయింది. టాలీవుడ్ లో స్టార్ట్ అయిన ప్రభాస్ జర్నీ దేశంలోని అన్ని సినీ పరిశ్రమలలోనూ తన స్టార్ డం కొనసాగుతోంది.