ఇంతకు ముందు వరకు కార్తీ అంటే సూర్య తమ్ముడిగానే తెలుసు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. కార్తీ కూడా అన్నకు ఏ మాత్రం తగ్గకుండా మంచి మంచి సినిమాలతో తన కెరీర్ లో జెట్ స్పీడు తో దూసుకుపోతున్నాడు. కార్తీ ఒక విభిన్నమైన నటుడు. ఎలాంటి పాత్రనైనా ఇట్టే పోషించగల మహానటుడు అని చెప్పాలి. అది కామెడీ అయినా, వీరత్వం అయినా పోలీసు పాత్ర అయినా, మాస్ పాత్ర అయినా..ఇలా ఎందులోనూ వెనక్కు తగ్గడు.