ప్రస్తుతం కరోనా అనంతరం తెలుగు ఇండస్ట్రీ సినిమాలతో వెలిగిపోతోంది. ఇపుడు వరుసగా అన్ని సినిమాలు విడుదల అవుతూ ఉన్నాయి. గత కొద్ది రోజుల నుండి తెలుగు సినీ జనాల్లో ఒక వార్త తరచుగా వినిపిస్తోంది. మహేష్ మరియు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వచ్చిన మహర్షి ఇండస్ట్రీ హిట్ ను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆయన కెరియర్ లోనే గుర్తుపెట్టుకోదగిన హిట్ ను నమోదు చేసింది.