దివి... తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ ఫోర్ తో తెలుగు ప్రేక్షకులందరికీ దగ్గరైన పేరు... బిగ్ బాస్ కన్నా ముందు ఈ చిన్నది పలు సినిమాల్లో నటించినప్పటికీ, అప్పటికీ ఈమె గురించి ఎవరికీ తెలియకపోవడంతో అంతగా ప్రసిద్ధి చెందలేదు.. అంతే కాకుండా చేసింది చిన్న చిన్న పాత్రలే కావడం వలన ఆమె నటించిన పాత్రలు ప్రేక్షకుల వరకు చేరుకోలేక పోయాయి. కానీ బిగ్బాస్ షోతో ఈ సొట్ట బుగ్గల సుందరి పేరు అంతటా మార్మోగిపోయింది.