తమిళ హీరో ఆర్య గురించి మనకు తెలిసిందే. ఇతనికి నటనలో ఎంతో ప్రతిభ ఉన్నా కూడా కాలం కలిసి రాక ఇంకా ఇండస్ట్రీలో ఒక రేంజు హిట్ రాలేదు. ఇతను నటించిన అన్ని చిత్రాలలో రాజు రాణి అనే తమిళ చిత్రం తెలుగు లో రీమేక్ చేశారు. ఈ సినిమా తనకు మంచి విజయాన్ని తీసుకువచ్చింది. ఇందులో ఆర్య సరసన నయనతార నటించింది. వీరిద్దరి నటనతో సినిమా ఎక్కడికో వెళ్లిపోయింది.