టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున తాజా చిత్రం వైల్డ్ డాగ్. ఈ వయసులో కూడా ఎంతో ఛాలెంజింగ్ పాత్రను ఎంచుకుని చేశారు. అయితే ఈ మూవీ ప్రస్తుతం అన్ని పనులను పూర్తి చేసుకుని థియేటర్లో సందడి చేయడానికి సిద్ధం అయింది. కానీ ముందు అనుకున్న ప్రకారం వాస్తవంగా ఈ సినిమాను ఒక ప్రముఖ ఓటిటిలో రిలీజ్ చేయాల్సినప్పటికీ ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి మంచి కలెక్షన్స్ అందిస్తున్నారనే ఉద్దేశంతో వైల్డ్ డాగ్ మేకర్స్ ఓటిటి నిర్ణయం వెనక్కి తీసుకున్నారు.