తమిళనాడు ప్రజలంతా అమ్మగా పిలుచుకున్న జయలలితకు వారి నుండి ఎంత ఆదరాభిమానాలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పే విషయం కాదు. ఆమె బ్రతికున్నంత కాలం ప్రజల కోసమే పాటుపడింది. అందుకే మన దేశంలో ఏ నాయకురాలికీ లేనంత గుర్తింపును గౌరవాన్ని ప్రజల నుండి పొందగలిగింది. ఈమె భౌతికంగా వారి మధ్య లేకున్నా నిరంతరం ఆమె బ్రతికుందనే ఆశతోనే ఎంతో మంది ప్రజలు ఉన్నారు.