బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన హీరో ప్రభాస్... ఆ తర్వాత అన్నీ భారీ ప్రాజెక్టులకే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తున్నారు. అందులో రాధేశ్యాం, ఆది పురుష్, సలార్ వంటి పలు చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. ఇప్పటికే రాధేశ్యామ్ మూవీ షూటింగును పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఆదిపురుష్ మరియు సాలార్ మూవీ లో షూటింగును జరుపుకుంటున్నాయి.