అసిస్టెంట్ డైరెక్టర్ గా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాని... అష్టా చమ్మా సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఇక అప్పటి నుండి ప్రతి అవకాశాన్ని సంపూర్ణంగా సద్వినియోగ పరచుకుంటూ తన టాలెంట్ తో తనేంటో నిరూపించుకున్నాడు నాని. ఎంతో సహజమైన నటనతో నేచురల్ స్టార్ గా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ఫుల్ ఫామ్ లో ఉన్న హీరోలలో నాని కూడా ఒకరు.