ఒకప్పుడు కొత్త డైరెక్టర్ల సినిమాలంటే ఎవరు పెద్దగా పట్టించుకునేవారు కాదు. ముందుగా ఆ సినిమాపై బజ్ క్రియేట్ అవ్వాలంటే ఆ చిత్ర దర్శకుడికి మినిమం ఓ హిట్ పడుండాలి లేదా హీరో అయినా బాగా పాపులర్ అయి ఉండాలి. లేదంటే అవకాశాలు దొరకడం చాలా కష్టము. ఇలాంటివి అప్పట్లో చాలానే చూశాం. కానీ ఇప్పుడు సినిమాని చూసే కోణం మారింది.