తాజాగా ఓ సినిమా ప్రమోషన్స్ కు అటెండ్ కావాలని హీరోయిన్ కు నిర్మాతలు ఏకంగా ప్రత్యేక విమానం పంపించడం ఆసక్తికర చర్చకు దారితీసింది. ఆ హీరోయిన్ ఎంత పెద్ద సెలబ్రిటీ అయి ఉంటే ఆమె కోసం విమానం పంపి ఉంటారు అన్న చర్చ మొదలైంది. ఇంతకీ ఆ క్రేజీ బ్యూటీ మరెవరో కాదు... గీత గోవిందం మూవీ హీరోయిన్ రష్మిక మందన్న. ఈ పాల బుగ్గల బామ్మ ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతోంది.