సాయి పల్లవి ఆట పాట అంటే ఏ రేంజ్లో ఉంటుందో అందరికీ తెలిసిందే. ఏ మాత్రం తగ్గని జోష్ తో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ అదిరిపోయే స్టెప్ లను వేస్తూ అంతకు మించిన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ భామ. ఫిదా సినిమా తో అన్ని రకాల ప్రేక్షకులను మెప్పించి ఫిదా చేసింది ఈ ముద్దుగుమ్మ. స్కిన్ షో చేయడానికి ఏమాత్రం ఇష్టపడని అరుదైన హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు.