ప్రస్తుతం టాలీవుడ్ లో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీ షెడ్యూల్ తో తన జోరు చూపిస్తున్నారు వెంకీ. వయసుతో సంబంధం లేకుండా యంగ్ హీరోలకు పోటీగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద యుద్దానికి సై అంటున్నారు. ఈ ఏడాది వెంకీ ఏకంగా మూడు చిత్రాలతో సందడి చేయనున్నారు.