కరోనా సెకండ్ వేవ్ దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. మళ్లీ పరిస్థితి మొదటికొస్తోందేమో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కేసులు మరింత భయపెడుతున్నాయి. ఇప్పుడు తాజాగా టాలీవుడ్ సినీ పరిశ్రమపై కరోనా తన ప్రభావాన్ని పెంచిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీ కరోనా లాక్ డౌన్ తో షూటింగ్ లకు బ్రేక్ వేస్తుందేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.