ప్రస్తుతం టాలీవుడ్ లో నూతన దర్శకుల ట్రెండ్ నడుస్తుందనే చెప్పాలి. అప్పట్లో స్టార్ హీరోలు అంటే పలానా సీనియర్ దర్శకులతో మాత్రమే చేస్తారు అనే లాండ్ మార్క్ ఉండేది. వాళ్లకు సూపర్ హిట్స్ అందించిన డైరెక్టర్స్ మాత్రమే ఆ హీరోకి తగ్గ స్టైల్ మూవీ తీయగలరని నమ్మేవారు.