ప్రస్తుతం చిరంజీవి ఆచార్య సినిమా షూటింగుతో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో చిరుతో పాటు రామ్ చరణ్ కూడా నటిస్తుండడంతో, ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తయితే, మరో రెండు సినిమాలు షూటింగుకు సిద్ధంగా ఉన్నాయి. ఇవి రెండూ కూడా రీమేక్ సినిమాలు కావడం విశేషం. ఒకటి మలయాళం మూవీ లూసిఫర్ రీమేక్ కాగా మరొకటి తమిళ మూవీ వేదాళం రీమేక్.