ప్రస్తుతం మరోసారి కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ప్రపంచమంతా వణుకుతోంది. ముఖ్యంగా భారతదేశం బిక్కు బిక్కు మంటోంది. ఇప్పటికే గతంలో కరోనా వలన అనుభవించిన కష్టాలు ఒక్కసారిగా కళ్ళముందు మెదలాడుతున్నాయి. మరో సారి ఇలా లాక్ డౌన్ కనుక పడితే, అసలు ఆ ఊహే భరించడానికి కష్టంగా ఉంది. చూస్తుంటే ఇది జరిగేలా అనిపిస్తోంది. కరోనా మెల్ల మెల్లగా తన ప్రభావాన్ని మరోసారి చూపుతోంది.