టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకించి ఏమీ చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలతో అభిమానులను అలరించిన నాగార్జునకు గత కొంతకాలం నుండి గడ్డు కాలం నడుస్తుంది అని చెప్పాలి. గతంలో నటించిన మన్మధుడు 2 ప్లాప్ అయిన తరువాత మరో సినిమా చేయడానికి కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఆ గ్యాప్ లో నటించిన చిత్రమే వైల్డ్ డాగ్.. ఇది గత వారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.