'దేత్తడి' యూట్యూబ్ చానల్ ద్వారా సందడి చేస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది అలేఖ్య హారిక . ఈ వెబ్ సిరీస్‌తో హారిక తన టాలెంట్ ప్రూవ్ చేసుకుని మంచి పేరు తెచ్చుకుంది. తెలంగాణ యాసతో కవ్వించే హారికకు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువే. తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది దేత్తడి హారిక. ఇక తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో ఎంట్రీ ఇచ్చాక ఈమె పెద్ద సెలబ్రిటీ గా మారిపోయింది.