అఖిల్ పేరుకి నాగార్జున తనయుడు. సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుర్రాడు...కానీ ఏం లాభం హిట్ కోసం ఇంకా టాలీవుడ్ పై దండయాత్ర చేస్తూనే ఉన్నాడు. అఖిల్ సినిమాకు నాగార్జున ఎంతవరకు సపోర్ట్ చేయగలడో అంత చేస్తున్నాడు. కానీ కాలం కలిసి రాకపోతే ఎవరు మాత్రం ఏంచేయగలరు. అయితే ఈ సారి మాత్రం అక్కినేని అభిమానులు పండుగ చేసుకునే హిట్ సినిమాను అందించడానికి మరో సినిమాతో మన ముందుకు వచ్చేస్తున్నాడు అక్కినేని అఖిల్.