ఒక నటుడికి పలు రకాల కలలు ఉండొచ్చు కానీ అవన్నీ నటనకి సంబంధించినవిగా ఉంటాయి. అయితే అందుకు పూర్తి భిన్నంగా కొందరికి వృత్తి ఒకటి అయితే ప్రవృత్తి మరొకటి కూడా ఉంటాయి. అలాంటి అరుదైన వ్యక్తులలో ఒకరు ముంబై మల్టీ టాలెంటెడ్ గర్ల్ మాళవిక శర్మ. లా స్టూడెంట్ గా ఉన్న ఈమె... అనూహ్యంగా సినిమాలో హీరోయిన్ గా అవకాశం రావడంతో కథానాయికగా మారింది.