పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరే ఓ ప్రభంజనం. అభిమానుల గుండెల్లో ఆనందాల వెల్లువలు విరబూయించే గబ్బర్ సింగ్. ఈయన స్టామినా గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తెలుగు ప్రజలకు దగ్గరవడం కోసం కెమెరాకు దాదాపు మూడేళ్లు గ్యాప్ ఇచ్చిన పవర్ స్టార్ ను తిరిగి వెండి తెరపై చూసేందుకు వేయి కళ్ళతో ఎదురు చూసారు అభిమానూలు . ఎట్టకేలకు వకీల్ సాబ్ మూవీతో తిరిగి రీ ఎంట్రీ ఇచ్చారు పవన్.