వకీల్ సాబ్ సినిమాలో వైవిధ్యభరిత కథతో.. ఒక నటుడిగా తనలోని మరో యాంగిల్ ను ఈ చిత్రంలో చూపించి ప్రేక్షకులను అలరించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నేడు ఎంతో వైభవంగా విడుదలైన వకీల్ సాబ్ పవన్ మార్కుకు తగ్గట్టే మంచి ఫలితాన్ని అందుకుంది. ఈ సినిమాను పవన్ ప్రకటించిన నాటి నుండి అందరి ఫోకస్ ఈ మూవీ పైనే..కథ ఏంటి, హీరోయిన్ ఎవరు, నటీ నటులు ఎవరు, సంగీత దర్శకుడు ఎవరు, స్టోరీ లైన్ అందరినీ ఆకర్షిస్తుందా...? ఇలా పలు ఆసక్తికర ప్రశ్నలతో అభిమానులు ఉబ్బితబ్బిబయ్యారు.